తాతాజీ హఠాన్మరణం బాధ కలిగించింది : టీవీ5 ఎండీ రవీంద్రనాథ్

తాతాజీ  హఠాన్మరణం బాధ కలిగించింది :  టీవీ5 ఎండీ రవీంద్రనాథ్

టీవీ5 తూర్పుగోదావరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తాతాజీ మృతికి ఛానల్ యాజమాన్యం, సిబ్బంది నివాళులు అర్పించారు. హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలోని ఆడిటోరియంలో సంతాప సభ నిర్వహించారు. తాతాజీ లాంటి మంచి వ్యక్తి దూరమవడం దురదృష్టకరమని ఎండీ రవీంద్రనాథ్ అన్నారు. మనలో ఒకడిగా ఉండి... ఇలా హఠాన్మరణం చెందడం బాధ కలిగించిందన్నారు. గోదావరి వరద ప్రాంతాల్లో అధ్బుతంగా కవరేజి అందిస్తున్న తాతాజీ ఆకస్మికంగా ఇలా రోడ్డు ప్రమాదంలో మృత్యువుపాలవడం కలిచివేసిందని ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్ విజయ్ రావిపాటి అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢసానుభూతి తెలిపారు. సంస్థ వీసీ సురేంద్రనాథ్, డైరెక్టర్ బలవంతరెడ్డి తాతాజీకి నివాళులు అర్పించారు. అనంతరం సిబ్బంది తాతాజీ చిత్రపటానికి నివాళులు అర్పించారు.

Tags

Read MoreRead Less
Next Story