33 ఏళ్ల తర్వాత కలుసుకున్న మిత్రులు

33 ఏళ్ల తర్వాత కలుసుకున్న మిత్రులు

వాళ్లంతా 33 ఏళ్ల క్రితం స్నేహితులు. ఇన్నేళ్ల తర్వాతా ఇప్పుడు కలుసుకున్నారు. దీంతో వారి ఆనందానికి అవదుల్లేకుండా పోయింది. వీరంతా 1986లో ఉస్మానియ యూనివర్శిటీలో చదువుకున్నారు. అప్పట్లో సివిల్‌ ఇంజనీరింగ్‌ చేశారు. మొత్తం 95 మంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ల గెట్ టు గెదర్‌ మీటింగ్‌కు నగర శివారులో ఉన్న ప్రగతి రిసార్ట్స్‌ వేదికైంది. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా బొంబాయి,దుబాయ్ నుండి కూడ ఈ గెట్‌ టు గెదర్‌ కు హాజరయ్యారు. అమెరికాలో స్థిరపడ్డవారు సైతం రావడం విశేషం,....

అప్పట్లో సివిల్‌ ఇంజనీరింగ్‌ చేసిన వీళ్లంతా... ఇప్పుడు కలుసుకోవడంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. తమ కుటుంబ యోగక్షేమాలతో పాటు గతస్మృతులను గుర్తు చేసుకున్నారు. ఇందులో 90 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులే. ఎక్కడెక్కడో ఉన్న తామంతా . ఇలా కలుసుకోవడం ఆనందంగా ఉందంటున్నారు మిత్రులు. .

Tags

Read MoreRead Less
Next Story