బాప్‌రే.. ఆటోలో 24 మంది.. ఏంది నాయనా ఇది..!

బాప్‌రే.. ఆటోలో 24 మంది.. ఏంది నాయనా ఇది..!

ఒక ఆటోలో ఎంతమంది పడతారు. ఓ మోస్తరు పర్సనాలిటీ ఉన్నవాళ్లయితే వెనుక ముగ్గురు కూర్చోవచ్చు. కాస్త స్లిమ్‌గా ఉంటే నలుగురు పడతారు. కానీ నిర్మల్ జిల్లాలోని నర్సాపూర్‌లో ఓ ఆటోవాలా ఏకంగా రెండు డజన్ల మంది ప్రయాణీకుల్ని ఎక్కించాడు. తిమ్మపూర్‌ గ్రామం నుంచి నిర్మల్‌ వెళ్తుండగా జనంతో కిక్కిరిసిన ఆటో పోలీసుల కంటపడింది. పోలీసులు షాకై ఒక్కొక్కరిని కిందకు దించుతూ లెక్కపెట్టారు.

పురాణాల్లోని పుష్పక విమానంలో ఎంతమంది కూర్చొన్నా మరొకరికి చోటు ఉంటుందంటారు. అలాగే ఈ ఆటోలో 24 మంది ప్రయాణీకుల్ని లోపల కుక్కేశాడు ఆటోడ్రైవర్‌. ఇందులో మహిళలు, పిల్లలే అధికం. అసలే ఆటో ప్రయాణాల్లో భద్రత అంతంతమాత్రం. ఇక 24 మంది అంటే ఏదైనా జరగరానిది జరిగే ఎందరి ప్రాణాలు పోతాయో ఊహించడం కూడా కష్టమే.

నిర్లక్ష్యంగా, అందరి ప్రాణాలతో చెలగాటమాడిన ఆటో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆటో సీజ్‌ చేశారు. మొత్తానికి నాలుగు రూపాయలు ఎక్కువ వస్తాయి కదా అని కక్కుర్తి పడి కటకటలాపాలయ్యాడు ఈ పుష్పక విమాన డ్రైవర్‌.

Also Watch :

Tags

Read MoreRead Less
Next Story