మణిక్రాంతి తల కోసం ముమ్మర గాలింపు

విజయవాడలో భర్త చేతిలో అతికిరాతకంగా హత్యకు గురైన మణిక్రాంతి తల కోసం ఏలూరుకెనాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 10 కిలోమీటర్లు ఉన్న కాలువలో విసృతంగా గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది. ఘటన జరిగి 36 గంటలు అయినా... ఇప్పటి వరకు హతురాలు మణిక్రాంతి తల దొరకలేదు. భార్యను హత్య చేసిన తర్వాత ఘటన స్థలం నుంచి తలను తీసుకెళ్లి కెనాల్‌లో పడేశాడు భర్త ప్రదీప్.
ఆదివారం జరిగిన ఈ కిరాతక ఘటనతో విజయవాడ సత్యనారాయణపురం శ్రీనగర్ కాలనీ హడలిపోయింది. కట్టుకున్న భార్య తనను జైలుకు పంపించిదన్న ఆక్రోషంతో రగిలిపోయిన ప్రదీప్. ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఐదేళ్ల క్రితం మణి, ప్రదీప్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రదీప్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. ఇద్దరు కులాలు వేరైనా ..పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.
మూడేళ్లు అనోన్యంగానే వీరి సంసారం గడిచింది. కానీ, గత రెండేళ్లుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఏడాదిన్నరగా వేర్వేరుగానే ఉంటున్నారు. కోర్టులో విడాకుల కేసు నడుస్తోంది. రేపో మాపో విడాకులు కూడా మంజూరు అయ్యే అవకాశాలున్నాయి. అయితే..ఈ గొడవల్లో ప్రదీప్ పై మణి కేసు పెట్టడంతో అతను జైలుకు వెళ్లాడు. దీంతో అతను రాక్షుడిలా మారి... ఈ దారుణానికి ఒడిగట్టాడు. .
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com