ఆవుల అనుమానాస్పద మృతిలో కొత్తకోణం

విజయవాడ తాడేపల్లి గోశాల ఆవుల అనుమానాస్పద మృతిలో కొత్తకోణం వెలుగుచూసింది. పశువులకు వేసిన గడ్డిలో అధికశాతంలో నైట్రోజన్‌ ఉన్నట్టు పశు సంవర్ధక శాఖ అధికారులు గుర్తించారు. గడ్డి ఏపుగా పెరగడానికి రైతులు నైట్రోజన్ వినియోగిస్తారు. అయితే నైట్రోజన్‌ పిచికారి చేసిన వారం రోజుల వరకు గడ్డికోయరాదు. అలాంటిది పిచికారి చేసిన రెండు రోజుల్లోనే గడ్డి కోసి ఆవులకు మేతగా వేసినట్టు అధికారులు గుర్తించారు. దీంతో టాక్సిటీ ఎక్కువై ఆవులు మృతి చెందాయన్నారు పశు సంవర్ధకశాఖ అధికారులు.

Tags

Next Story