తాతాజీకి టీవీ5 చైర్మన్ BR నాయుడు నివాళి

తాతాజీకి టీవీ5 చైర్మన్ BR నాయుడు నివాళి
X

రిపోర్టర్ తాతాజీ మరణవార్త.. టీవీ5 కుటుంబాన్ని తీవ్రంగా కలచివేస్తోంది. నిన్నటి వరకూ రిపోర్టింగ్ చేస్తూ, వరదల కవరేజ్‌లో బెస్ట్ అని అందరితోనూ అనిపించుకున్న వ్యక్తి.. ఇవాళ మనమధ్య లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రమాదం జరిగిన తీరు పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. టీవీ5 యాజమాన్యం నిన్న ప్రమాద విషయం తెలిసినప్పటి నుంచి తాతాజీని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది. రాజమండ్రిలో అత్యుత్తమ వైద్యసేవలు అందించే ఏర్పాట్లు చేసింది. వెంటిలేటర్‌పై ఉన్న తాతాజీ చికిత్సకు స్పందిస్తున్నాడు అనుకునేలోపే.. ఉదయం హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఊపిరి ఆగిపోయింది. ఈ విషయం తెలిసి టీవీ5 యాజమాన్యం, సిబ్బంది విషాదంలో మునిగిపోయారు. ఛైర్మన్ BR నాయుడు రాజమండ్రి వెళ్లి.. నివాళులు అర్పించారు. స్థానిక ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్, జీఎంసీ బాలయోగి కుమారుడు హరీష్ సహా పలువురు నేతలు.. శ్రద్ధాంజలి ఘటించారు.

Tags

Next Story