ఆంధ్రప్రదేశ్

సీఎం కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికిన వైసీపీ నేతలు

సీఎం కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికిన వైసీపీ నేతలు
X

సీఎం కేసీఆర్‌ తమిళనాడు పర్యటనకు బయలుదేరారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన కేసీఆర్.. తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ వైసీపీ నేతలు కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. మధ్యాహ్నం ఒంటి గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న కేసీఆర్‌.. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కంచీకి వెళ్తారు. కంచీలోని అత్తి వరదర్‌స్వామి ఆలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. కేసీఆర్‌నును స్వాగతిస్తూ తిరుపతిలో వైసీపీ నేతలు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Next Story

RELATED STORIES