ఆంధ్రప్రదేశ్

ఇద్దరు సీఎంలు కలిసి ఆంధ్రాకు అన్యాయం చేయాలని చూస్తున్నారు:చంద్రబాబు

గోదావరి నీటిని తెలంగాణ భూ భాగంలోకి తీసుకెళ్లి.. అక్కడి నుంచి శ్రీశైలానికి తెస్తామనటం అన్యాయమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్-కేసీఆర్‌లు ఆంధ్రాకు అన్యాయం చేసేలా ఆలోచనలు చేస్తున్నారని మండిపడ్డారు. మన భూ భాగం నుంచే నీటిని తీసుకెళ్లే ప్రాజెక్టుకు ఆలోచనలు చేయాలన్న బాబు.. 450 కిలోమీటర్లు నీటిని తీసుకుపోవడం ప్రజల సెంటిమెంట్‌కు సంబంధించిన విషయమన్నారు. ఇది ఇద్దరు ముఖ్యమంత్రులు అనుకుని చేసే కార్యక్రమం కాదని.. ఇద్దరు ముఖ్యమంత్రులు శాశ్వతం కాదని అన్నారు. స్వార్థ నిర్ణయాలతో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీయొద్దని చంద్రబాబు హెచ్చరించారు.

Next Story

RELATED STORIES