గోటితో పోయేదానికి గొడ్డలిదాక తెచ్చారు - పవన్ కల్యాణ్
BY TV5 Telugu13 Aug 2019 11:17 AM GMT

X
TV5 Telugu13 Aug 2019 11:17 AM GMT
ఎమ్మెల్యే రాపాక అరెస్ట్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రజల తరపున పోలీస్ స్టేషన్ కి వెళ్లిన ఎమ్మెల్యే రాపాకను అరెస్టు చేయడం కరెక్ట్ కాదని పవన్ అభిప్రాయపడ్డారు.గోటితో పోయేదానికి గొడ్డలిదాకా తీసుకువచ్చారని పవన్ పేర్కొన్నారు. నెల్లూరు లో వైసీపీ ఎమ్మెల్యే జర్నలిస్ట్ పై దాడికి ప్రయత్నిస్తే... ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తే.. తాను రాజోలు వచ్చి పోరాడతానని పవన్ ఈ సందర్భంగా హెచ్చరించారు.
Next Story