వరద బాధితులకు భారీ సాయం.. బాలీవుడ్ జంట ఔదార్యం

వరద బాధితులకు భారీ సాయం.. బాలీవుడ్ జంట ఔదార్యం

అందమైన రూపం వుంటే సరిపోదు.. స్పందించే మనసు కూడా ఉండాలని నిరూపించింది నటి జెనీలియా. భర్త రితేష్‌తో కలిసి వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతు సహకారం అందించారు. మహారాష్ట్రను ముంచెత్తిన వరదల కారణంగా జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాటిని చూసి చెలించిన జెనీలియా దంపతులు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షల విరాళం అందజేశారు. వరదల కారణంగా గత కొన్ని రోజులుగా మహారాష్ట్రతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండడం మనసును కలచి వేసింది. అందుకే మా వంతుగా వారికి కొంత సాయం చేయాలనుకున్నాము. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రిని కలిసి 'దేశ్ ఫౌండేషన్' తరపున విరాళం అందించామని రితేష్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన అన్నారు. చేయి చేయి కలిస్తే ఎంతైనా సాధించవచ్చని రితేష్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ట్విట్టర్ వేదికగా జెనీలియా, రితేష్ దంపతులకు ధన్యవాదాలు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story