ఆ బాక్స్‌లో అయిదు ఆలూ చిప్స్.. ఖరీదు రూ.3,993.64

ఆ బాక్స్‌లో అయిదు ఆలూ చిప్స్.. ఖరీదు రూ.3,993.64

పది రూపాయలు పెడితే చిన్న చిప్స్ పాకెట్ వస్తుంది. పోనీ రూ. 50. అదే పాకెట్ థియేటర్‌లో కొంటే రూ.100లు అనుకోండి. మరి వంద కాదు రెండొందలు కాదు ఏకంగా 3,993 లు. అది కూడా అయిదు చిప్సేనట. ఇదెక్కడి గొడవ. తినడానికేనా లేక దాచుకోవడానికా. ఇంతకీ అవి ఆలూ చిప్సేనా. ఇలా ఎన్నో డౌట్లు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆలూ చిప్స్.. స్వీడన్‌కు చెందిన సెయింట్ ఎరిక్ బ్రేవరీ అనే కంపెనీ తయారు చేసి విక్రయిస్తోంది. ఈ ప్యాకెట్ ధర 56 డాలర్లు. అంటే మన ఇండియన్ కరెన్సీలో రూ.3,994లు. అంటే ఒక్క చిప్ ధర రూ.784.11. ఇంతకీ ఆ చిప్స్ గొప్పతనమేంటని ఆరా తీస్తే.. చిప్స్‌ది కాదు బాబూ.. ఉన్నదంతా బాక్స్‌లోనే అంటున్నారు. ఇది ఒక జ్యూయలరీ బాక్స్.. ఇందలో అయిదు చిప్స్ మాత్రమే పడతాయి. మేనేజర్ మార్క్స్ ప్రియరీ మాట్లాడుతూ.. మా కంపెనీకి వచ్చే వారికి బీరుతో పాటు సర్వ్ చేసేందుకు ప్రత్యకమైన స్నాక్‌ని అంతకంటే ప్రత్యేకంగా తయారు చేయించిన బాక్స్‌లో అందించాలనుకున్నాం. అందుకే ఈ ఆలూ చిప్స్ రూపొందించాం అంటున్నారు. కాగా, ఈ చిప్స్ అయిదూ కూడా అయిదు రకాల టేస్టుల్లో ఉంటాయి. ఇంకా ఈ చిప్స్ తయారీకి అత్యంత అరుదుగా దొరికే సామాగ్రిని ఉపయోగిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story