వావ్.. నా కోసం ఓ విమానం.. నేనొక్కడినే ప్రయాణం.. వీడియో

వావ్.. నా కోసం ఓ విమానం.. నేనొక్కడినే ప్రయాణం.. వీడియో

రోడ్డు మీద నడిచే బస్ ఫుల్లవ్వకపోతేనే కండక్టర్ బస్టాప్‌ల పేరు చెబుతూ ప్రయాణీకులు మరింత మంది ఎక్కాలని కోరుకుంటాడు. మరి ఆకాశంలో విహరించే విమానం ఎవరిని అడుగుతుంది. సమయానికి టికెట్లు బుక్ చేసుకోవాలి. ఆ టైమ్ అవ్వగానే వెళ్లిపోవాలి. ఎంత మంది వస్తే అంతమందితోనే ఎగిరిపోవాలి. మరి ఒక్కరే ప్రయాణించాల్సి వస్తే.. ఆ ఒక్కరికే విమాన సిబ్బంది సాదర స్వాగతం పలికితే.. వావ్.. కలలోనైనా అనుకోలేదే ఇలాంటి రోజు వస్తుందని.. అలాంటి అనుభూతికేలోనై.. అందరికీ షేర్ చేశారు నిజంగానే జరిగిందని చెప్పారు న్యూయార్క్‌కి చెందిన ప్రముఖ రచయిత విన్సెంట్ పియోన్. కొలరాడోలోని ఆస్పెన్ నుంచి సాల్ట్‌లేక్ సిటీలోని తన ఇంటికి వెళ్లేందుకు బయలు దేరారు పియోన్. డెల్టా విమానంలో ప్రయాణించడానికి తానొక్కడినే బుక్ చేసుకున్నానన్న విషయం ఎయిర్ పోర్టుకు వచ్చేంతవరకు తెలియదు.

బోర్డింగ్ వద్దకు వెళ్లగానే విమాన సిబ్బంది.. మీరొక్కరే ఈ విమానంలో ప్రయాణించేది అని అనగానే ఒకింత ఆశ్చర్యం.. మరికొంత గర్వంగానూ అనిపించింది. నాకోసం.. ఓ విమానం.. ఏమి నా రాజసం అనుకున్నారు కాసేపు మనసులో. ఇలాంటి అవకాశం ఇంతకు ముందు ఎవరికైనా వచ్చిందా లేక నేనే మొదటి వ్యక్తినా అని సిబ్బందిని ప్రశ్నించారు పియోన్. గతంలో కొన్ని సందర్భాల్లో ఇలా జరిగిందని వారు చెప్పుకొచ్చారు. సరేలే అదంతా నాకెందుకు.. నాకు మాత్రం ఈ జర్నీ చాలా స్పెషల్ అని వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. విమానంలో ఒక్కడినే కావడంతో బరువు కోసమని సిబ్బంది ఇసుక సంచులు వేశారు. అనంతరం విమానం లోపలికి వెళ్లగానే సిబ్బంది స్వాగతం పలకడంతో గొప్ప అనుభూతికి లోనయ్యాను అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. పియోన్ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story