ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన హీరో.. పోలీసుల చేతిలో..

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన హీరో.. పోలీసుల చేతిలో..

వెళ్లవయ్యా వెళ్లు.. నువ్వు నాగశౌర్య అయితే మాకేంటి. ట్రాఫిక్ రూల్స్ అందరికీ ఒకటే.. మీరు హీరోలని మిమ్మల్ని వదిలేశామనుకోండి.. సామాన్యుల చేతిలో మేం బుక్కయిపోతాం. రూల్స్ అతిక్రమించినా వాళ్లనైతే వదిలేస్తారు. మమ్మల్ని మాత్రం బాదేస్తారని అంటారు. అయినా సినిమాల్లో ఎన్నో నీతులు చెబుతారు. మరి ఆచరణలోకి వచ్చేసరికి అందరిలానే ప్రవర్తిస్తామంటారు. ఆ పాత్రల్లో కొంచెమైనా జీవించలేరా హీరోలు.. ట్రాఫిక్ రూల్స్‌‌కు ఎవరూ అతీతులు కారని నిరూపించారు హైదరాబాద్ పోలీసులు. బంజారా హిల్స్ రోడ్ నెం.1లో రెగ్యులర్ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వస్తున్న నాగశౌర్య కారును ఆపి అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ తొలగించి రూ.500లు ఫైన్ వేశారు. ఇటీవల అల్వాల్ సమీపంలో మంచిర్యాల జాయింట్ కలెక్టర్ కారు ఓవర్ స్పీడ్ వెళుతుండడంతో ఆయనకూ చలాన్ రాశారు. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ కూడా ఒకనొక సందర్భంలో ట్రాఫిక్ రూల్స్‌ని అతిక్రమించినవారే.

Tags

Read MoreRead Less
Next Story