ఇదేనా మీకు చేతనైన పరిపాలన : నారా లోకేష్ ఫైర్

X
వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ట్విట్టర్లో తీవ్ర విమర్శలు చేశారు లోకేష్. కూల్చడాలే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వ పాలన సాగుతోందని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురంలో టీడీపీ నాయకులకు చెందిన 3 ఇళ్లను అక్రమకట్టడాల పేరుతో కూల్చడాన్ని తప్పుపట్టారు. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసు యంత్రాంగం కూడా వైకాపా దౌర్జన్యాలకు అండగా నిలుస్తుండడం దురదృష్టకరమని ట్వీట్ చేశారు. కక్షసాధింపులు, కూల్చడాలు.. ఇదేనా మీకు చేతనైన పరిపాలన అంటూ జగన్ను నిలదీశారు. అధికారం శాశ్వతం కాదు అని గుర్తించుకోవాలంటూ చురకలు వేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
