ప్లీజ్ విడిపించండి.. మీకంటే తక్కువే తిన్నాను: మేక రిక్వెస్ట్

ఫ్రీగా వస్తే ఫినాయిలైనా తాగేస్తారని అంటారు.. కానీ నేను అలాంటి దాన్ని కాదండి.. ఏదో ఆకలేసిందని పచ్చని మొక్కలు కనిపిస్తే ఓ పది మొక్కలు తిన్నానండి.. అంత మాత్రానికే కట్టేసి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు.. ప్లీజ్ విడిపించరూ అని వేడుకుంటోంది.. మెడలో బోర్డు వేసుకుని మరీ రిక్వెస్ట్ చేస్తోంది వనపర్తి జిల్లాకు చెందిన మేక. వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం ఏదుట్లలో NREGA కింద రోడ్డు వెంట నాటిన మొక్కలను మంగళవారం ఓ మేక తినేసింది. దీంతో మేకను పంచాయితీ రాజ్ కార్యదర్శి చెట్టుకు కట్టేశారు. మేకల యజమానిని హెచ్చరించేందుకు దాని మెడలో ఓ బోర్డు కట్టారు. తెలియక మేశాను విడిపించండి అని రాసి పెట్టారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. పాలకులు మేసే అవినీతి సొమ్ము ముందు మేక తిన్న మొక్క చాలా చిన్నది అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com