ఆంధ్రప్రదేశ్

బంగారంతో పోటీ పడుతున్న ఇసుక ధరలు!

బంగారంతో పోటీ పడుతున్న ఇసుక ధరలు!
X

చిత్తూరు జిల్లాలో ఇసుక ధరలు బంగారంతో పోటీ పడుతున్నాయి. నిర్మాణ రంగానికి అత్యంత కీలకమైన ఇసుకపై సర్కార్‌ ఆంక్షలు విధించడంతో రేటు 5 రెట్లు పెరిగిపోయింది. కొత్త పాలసీ ప్రకటించకపోవడంతో నిర్మాణ అనుబంధ రంగాలు గాడితప్పాయి. చిత్తూరు జిల్లాలో ఇసుక కొరత తీవ్రంగా ఉంది. ఇల్లు కట్టుకునే వాళ్లు, ప్రభుత్వ పనుల కోసం నిర్మాణాలు చేపట్టినవారు.. తహశీల్దార్ అనుమతితో ఇసుక తీసుకోవచ్చు. అదికూడా వారంలో మూడు నుంచి ఐదు లోడ్లు మాత్రమే. తహశీల్దార్‌కు అర్జీ పెట్టుకుంటే ఆన్‌లైన్ ద్వారా అనుమతులు ఇస్తారు. ఆ క్యూఆర్ కోడ్‌ పత్రాన్ని సంబంధిత రీచ్‌లో చూపించాలి. దీంతో బ్లాక్ మార్కెట్ పెరిగిపోయింది. గత ప్రభుత్వంలో ఇసుక ఫ్రీ. దూరాన్ని బట్టి రవాణా, కూలీల ఖర్చు కలుపుకుని మూడు నుంచి అయిదు వేలు అయ్యేది. ఇప్పుడు నాలుగైదు రెట్లు ఎక్కువ పెట్టి బ్లాక్‌లో కొనాల్సిన దుస్థితి. సామాన్యులు ఒక లోడుకు 15 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. తహశీల్దార్ అనుమతులు ఒక పార్టీవారికి మాత్రమే వస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. అధికారులు మాత్రం అదేమీ లేదంటున్నారు.

ఇసుక అక్రమ రవాణా చేస్తూ పెద్దసంఖ్యలో వాహనాలు దొరుకుతున్నాయి. అనుమతులు లేకుండా తరలిస్తున్నది కొందరైతే.. ఒక రీచ్‌లో పర్మిషన్ తీసుకుని మరోచోట తవ్వుకున్నవారు మరికొందరు. ఒక్క గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోనే 50 కేసుల వరకు నమోదు అయ్యాయి. దీంతో.. ఇసుకాసురులు ట్రాన్స్‌పోర్టు లారీల్లో తరలించడం మొదలుపెట్టారు. పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.

ఇసుక లభ్యత లేకపోవడంతో నిర్మాణరంగంపై అధారపడిన కార్మికులు రోడ్డున పడ్డారు. సిమెంట్, స్లీల్ విక్రయాలపైన ప్రభావం పడింది. దీంతో ఎలక్ట్రికల్స్, హార్డువేర్, గ్రానైట్స్, టైల్స్, ఉడ్ వర్క్.. ఇలా అన్ని వ్యాపారాలు గాడితప్పాయి. ఇసుక బదులు క్వారీ డస్ట్‌తో నిర్మాణం చేద్దామన్నా అది కూడా దొరకని పరిస్థితి.

Also Watch :

Next Story

RELATED STORIES