ఓ నా బంగారం.. ఎంత బాగా చేశావు.. మహేష్ బాబు ఫిదా

ఓ నా బంగారం.. ఎంత బాగా చేశావు.. మహేష్ బాబు ఫిదా

చిట్టి తల్లి బుడి బుడి అడుగులేస్తూ నడిస్తే ఆనందం. పడుతూ లేస్తూ నాన్న చేయి పట్టుకుంటే చెప్పలేనంత సంతోషం. పాపాయి ప్రతి కదలికా తల్లితండ్రులకు ఎనలేని ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. వచ్చీ రాని మాటలు.. ముద్దూ ముచ్చట్లు అన్నీ ఆనందాన్ని పంచేవే.. అలసట తీర్చేవే. ఎదుగుతున్న క్రమంలో ఎన్నో నేర్చుకుంటారు. ఒక్కోసారి అమ్మానాన్నలకే పాఠాలు చెబుతుంటారు. అందాల రాకుమారుడు మహేష్ బాబు కూతురు కూడా నాన్నను మించి స్టెప్పులేస్తోంది.. నాన్నకే ఔరా అనిపించేలా చేస్తుంది. అప్పుడే స్టెప్సేసేంత పెద్దగా అయిపోయావారా బంగారం అని మురిసిపోతున్నాడు మహేష్. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మహేష్.. నాన్న కంటే రెండు ఆకులు ఎక్కువే చదివింది ఈ చిట్టి తల్లి. తాను చేసే ప్రతి అల్లరిని, ఆటపాటల్ని ట్విట్టర్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంది. తాజాగా సితార చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాన్న మహర్షి సినిమాలోని పాలపిట్టలో మెరుపు అనే పాటకు స్టెప్పులేసింది. మహేష్‌తో పాటు ఆయన అభిమానులు కూడా సితార స్టెప్పులు చూసి ఫిదా అవుతున్నారు. ఎంత బాగా చేశావురా బంగారం అంటూ తెగ పొగిడేస్తున్నారు. తండ్రికి తగ్గ తనయ అంటూ దీవిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story