వైసీపీ జెండా స్తంభానికి విద్యుత్ షాక్... ముగ్గురు చిన్నారుల మృతి

X
ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కొప్పరలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్తో ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఇవాళ ఉదయం వైసీపీ జెండా స్తంభాన్ని పట్టుకుని ఆడుకుంటుండగా అది ఊగి పక్కనే ఉన్న కరెంట్ వైర్లకు తలగడంతో షాక్ కొట్టి ముగ్గురూ చనిపోయారు. ఈ వార్త గ్రామంలో పెను విషాదాన్ని నింపింది. చనిపోయిన ముగ్గురు ఐదవ తరగతి విద్యార్థులే. షేక్ పఠాన్ గౌస్, షేక్ హసన్, పఠాన్ అమర్ ముగ్గురూ ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరై విలపిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
