రణరంగం మూవీ రివ్యూ

రణరంగం మూవీ రివ్యూ

విడుదల తేదీ : ఆగస్టు 15, 2019

నటీనటులు : శర్వానంద్, కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్‌

దర్శకత్వం : సుధీర్ వర్మ

నిర్మాత‌లు : సూర్యదేవర నాగవంశీ

సంగీతం : ప్రశాంత్ పిళ్ళై

సినిమాటోగ్రఫర్ : దివాకర్ మణి

ఎడిటర్ : నవీన్ నూలి

తెలుగులో నటన పరంగా మాట్లాడుకునే హీరో లలో శర్వానంద్ ఒకరు. ఏ పాత్రలోనయినా మెప్పించడం శర్వా దిట్ట. ఒక గ్యాంగ్ స్టర్ లైఫ్ స్టోరీ గా తెరకెక్కిన ‘రణరంగం’ శర్వా ఇమేజ్ పై కొత్త లుక్ ని తెచ్చింది. సుధీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ పై ప్రీ రిలీజ్ అంచనాలు అమాంతం పెరిగాయి.

కథ :

ఇది 1980లో జరిగే కథ ... దేవ (శర్వానంద్ ) అనాథ .. ప్రెండ్స్ తో కలిసి పెరిగిన దేవా సినిమా థియేటర్స్ దగ్గర బ్లాక్ టికెట్స్ అమ్ముకుంటూ జీవితం గడుపుతుంటాడు. జీవితంలో ఎదగాలనే కసితో దొంగతనంగా మద్యం అమ్మడం మొదలు పెడతాడు. ఇక ప్రస్తుతానికి వస్తే అండర్ వరల్డ్ కి డాన్ గా దేవాజీవితం సాగుతుంది. అక్కడి నుండే షిప్సింగ్ బిజనెస్ లు చేస్తూ తన మాటతో చీకటి ప్రపంచాన్ని శాసిస్తుంటాడు. ఒక గల్లీ రౌడీగా మొదలైన దేవా జీవితం ఆ స్థాయి ఎదగడానికి ఎలాంటి మలుపులు తీసుకుంది. తన వదిలేసిన పగలు తనను ఎలా వెంటాడాయి..? దేవా వాటినుండి ఎలా బయటపడ్డాడు అనేది మిగిలిన కథ..?

కథనం:

ఈ సినిమాకి మొదటి బలం హీరో శర్వానంద్ . తన పాత్రను అలవోకగా తెరమీదకు తెచ్చాడు. ఒక ముడు పదుల ప్రయాణాన్ని ఎక్కడా తొణకకుండా చేశాడు. అతనిలోని స్టామినాకు ‘రణరంగం’ ఒక ఉదాహారణగా నిలుస్తుంది. ఒక గల్లీ రౌడీగా కనిపించిన గడుసుదనం.. ఒక డాన్ గా కనిపించిన హాందాతనం రెండూ బాలెన్స్ చేస్తూ ఏ సన్నివేశంలో అయినా ఆ మూడ్ ని మాత్రమే తీసుకురాగలిగాడు. ఇది సూటిగా చెప్పిన కథ కాదు. నాన్ లీనియర్ గా చెప్పిన కథలో శర్వా రెండు పాత్రలను పోషించినట్లుంది. ఇంకా చెప్పాలంటే దేవా యంగ్ గెటప్ కి ప్రజెంట్ గెటప్ మధ్య వ్యత్యాసాలను చాలా బాగా పలికించాడు. రణరంగం సుధీర్ వర్మ మేకింగ్ స్టయిల్ కి అద్దం పట్టింది. మోస్ట్ స్టైలిష్ గా రణరంగం ను తెరమీద నిలిపాడు దర్శకుడు. ఇంకా దేవా కథలో ప్రేమ కథ మరింత ఆకట్టుకుంది. కళ్యాని ప్రియదర్శిని తో దేవా ప్రేమ సన్నివేశాలన్నీ సున్నితమైన హాస్యం తో మనసును కదిలించే మాటలతో సాగాయి. ఆ ప్రేమకథ మరికాసింత సేపు ఉంటే బాగుంటుందనే భావన కలిగింది. వారి ప్రేమకథ తో ఒక సినిమాను చేయొచ్చు అన్నంతగా ఆకట్టుకుంది. ఇక కాజల్ పాత్ర కేవలం ఆపాత్ర బరువు పెంచేందుకు మాత్రమే ఉపయోగ పడింది. సెకండాఫ్ కొచ్చేసరికి దేవా ఒక గ్యాంగ్ స్టర్ గా ఎదిగిపోయాడు. అందుకే ఆ కథలో ఆసక్తికరమైన మలుపులను జొప్పించలేకపోయాడు. తనను వేటాడుతున్న గ్యాంగ్ ను పట్టుకునేందుకు దేవా ఎలాంటి ఎత్తులు వేశాడు అనే పాయింట్ ని చాలా ఆసక్తికరంగా మలిచాడు. ‘నేను చేస్తున్నది గవర్నమెంట్ జాబ్ కాదు రిలాక్స్ అవడానికి’ లాంటి డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. శర్వానంద్ పోషించిన దేవా పాత్ర అతని కెరియర్ లో చెప్పకోదగ్గ పాత్రగా మిగిలుతుంది. అతని పాత్రలోకనిపించిన భిన్నమైన కోణాలను ఒక సినిమాలో ఆవిష్కరించడం అంత తేలికైన పనికాదు. శర్వాకెరియర్ లో ‘దేవా’ పాత్ర ఒక మైలురాయిగా నిలుస్తుంది. రియలిస్టిక్ అనిపించే పోరాటాలు, దెబ్బ మీద పడుతున్నా పంజా విసరడమే కాదు, వెనకడుగు వేయడం తెలయని ఒక గ్యాంగ్ స్టర్ కథ తెరపై థ్రిల్లింగ్ గా సాగింది.

చివరగా:

రణరంగంలో దేవా అండ్ టీం గెలిచింది.

- కుమార్ శ్రీరామనేని

Tags

Read MoreRead Less
Next Story