ఆగి ఉన్నలారీని ఢీకొన్న బస్సు

ఆగి ఉన్నలారీని ఢీకొన్న బస్సు

మెదక్‌ జిల్లా నార్సింగ్‌ శివారులో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి నిజామాబాద్‌ వెళుతున్న ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సు ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 40 మంది ప్రయాణీకుల్లో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

అప్పటికే ప్రమాదానికి గురైన ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సును వెనక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు. ఈ ప్రమాదంతో నేషనల్‌ హైవేపై 2 గంటలపాటు భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. యాక్సిడెంట్‌లో గాయపడ్డవారిని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story