రికీ పాంటింగ్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన కోహ్లీ

రికీ పాంటింగ్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన కోహ్లీ

వరుస రికార్డులతో హోరెత్తిస్తున్నాడు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ. ఇప్పటికే ఎవరికి సాధ్యం కానీ ఫీట్లను సాధించిన కోహ్లీ.. తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో మెరుపు సెంచరీ చేసిన విరాట్‌.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ దశాబ్ద కాలంలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు.

ఇప్పటివరకూ ఈ రికార్డు ఆసీస్‌ దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్‌ పేరిట ఉండగా, దాన్ని కోహ్లి బ్రేక్‌ చేశాడు. ఓ దశాబ్ద కాలంలో పాంటింగ్‌ 200 మ్యాచ్‌లు ఆడి 18 వేల 962 పరుగులు సాధించగా.. ఆ రికార్డును కోహ్లి సవరించాడు. మరోవైపు వన్డే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన కెప్టెన్‌గా కోహ్లి రెండో స్థానంలో నిలిచాడు. వన్డే కెప్టెన్‌గా కోహ్లి 21 శతకాలు చేయగా.. పాంటింగ్‌ 22 సెంచరీలతో టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. అంతే కాదు విండీస్‌ పర్యటనలో అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మన్‌గా కూడా కోహ్లి ఘనత సాధించాడు. ఓవరాల్‌ విండీస్‌ పర్యటనలో కోహ్లికి ఇది నాల్గో వన్డే సెంచరీ కాగా.. ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యు హేడెన్‌ మూడు సెంచరీలు చేశాడు.

Tags

Read MoreRead Less
Next Story