అందుకే ఆస్పత్రులకు బడ్జెట్‌ కేటాయించలేదు: మంత్రి ఈటెల

అందుకే  ఆస్పత్రులకు బడ్జెట్‌  కేటాయించలేదు: మంత్రి ఈటెల

ఆరోగ్యశ్రీపై ప్రైవేట్‌ ఆస్పత్రులతో మంత్రి ఈటెల రాజేందర్ జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. తమకు రావాల్సిన బకాయిల్ని చెల్లించేవరకు ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపివేస్తామని ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులు స్పష్టం చేశారు. అయితే బకాయిల పేరిట అత్యవసర సేవలు నిలిపేవడం సరికాదన్నారు మంత్రి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆస్పత్రులు సహకరిస్తాని భావిస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్యశ్రీ సేవల నిలుపుదలను తాత్కాలిక సమ్మెగానే పరిగణిస్తామని అన్నారు మంత్రి ఈటెల.

వరుస ఎన్నికల కోడ్‌ కారణంగా ఆస్పత్రులకు బడ్జెట్‌ కేటాయించలేక పోయామని వివరించారు మంత్రి. దశల వారిగా బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 12వందల కోట్ల బకాయిలున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు మంత్రి. కేవలం 6 వందల కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉందన్నారు...

అయితే ప్రభుత్వ వాదనతో ప్రైవేట్ ఆస్పత్రుల సంఘం ఏకీభవించలేదు. తమకు దాదాపు 15 వందల కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉందని చెబుతున్నాయి.సెప్టెంబర్‌లో కొన్ని బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పినట్లు ప్రైవేట్ సంఘాల ప్రతినిధులు తెలిపారు...M.O.Uలో కూడా మార్పులు చేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం 20 శాతం బకాయిలు మాత్రమే చెల్లించడంపై ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి... బకాయిలు చెల్లించేవరకు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తామని స్పష్టం చేశాయి..

Tags

Read MoreRead Less
Next Story