ప్రేమించిన పాపానికి ఓ యువతిని..

ప్రేమించిన పాపానికి ఓ యువతిని..

ఇద్దరు యువతీయువకులు ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు.. కానీ ఇది గ్రామపెద్దలకు నచ్చలేదు. అంతే.... పంచాయతీ పెట్టి తమ రాక్షసత్వాన్ని ప్రదర్శించారు. దళిత కుటుంబానికి చెందిన అమ్మాయిని గొడ్డును బాదినట్లు బాదారు.... కొట్టడం, తన్నడం, నెట్టేయడం, బూతులు తిట్టడం ఒకటేంటి... నాగరిక సమాజంలో బతుకుతున్న ఒక సగటు జీవి చేయకూడని పనులన్నీ చేశాడు.. ఆ గ్రామ పెద్ద. అమ్మాయి అన్న కనీసం ఇంగితం కూడా లేకుండా పశువులా ప్రవర్తించాడు....

అనంతపురం జిల్లా గుమ్మగుట్ట మండలం పి.కె.దొడ్డి గ్రామంలో జరిగిందీ దారుణ ఘటన. దళిత కులానికి చెందిన ప్రేమజంట వ్యవహారాన్ని పంచాయితీ పెట్టి పరిష్కరించేందుకు సిద్ధమయ్యారు ఆ గ్రామ పెద్దలు. ఆ సందర్భంగానే ఇలా పైశాచికంగా ప్రవర్తించారు. కన్నవారికే పిల్లలపై చేయి చేసుకునే అధికారం లేని నేటి సమాజంలో.. పంచాయతీ పెద్దలు ఇలా దాడి చేయడమేంటని నిలదీస్తున్నారు.. దళిత సంఘాల నేతలు. ఇలాంటి ఆటవిక సంస్కృతి కొనసాగకుండా ఉండాలంటే... పంచాయతీ పెద్దలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు..

Tags

Read MoreRead Less
Next Story