అంతర్జాతీయం

అమెరికాను మరోసారి హెచ్చరించిన చైనా

అమెరికాను మరోసారి హెచ్చరించిన చైనా
X

అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతోంది. ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. తాజాగా అగ్రరాజ్యం అమెరికాను మరోసారి హెచ్చరించింది చైనా. సెప్టెంబరు 1 నుంచి తమ దిగుమతులపై పన్నులు పెంచే యోచన చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది.

చైనా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై అదనంగా మరో 10శాతం సుంకం పెంచాలని భావిస్తున్నట్లు ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. అయితే, వాటిలో 60శాతం వస్తువులపై పన్నులు విధించాలన్న నిర్ణయాన్ని డిసెంబరు వరకు వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా మొబైల్‌ఫోన్స్‌, ల్యాప్‌టాప్స్‌, వీడియో గేమ్‌ కన్సోల్స్‌, కొన్ని రకాల బొమ్మలు, కంప్యూటర్‌ మానిటర్‌లు, షూలు, బట్టలపై 10శాతం పన్నులు విధిస్తే దాదాపు 300 బిలియన్‌ డాలర్ల విలువైన దిగుమతులపై ప్రభావం పడనుంది.

ఈ వాణిజ్య యుద్ధం కారణంగా అమెరికా నుంచి చైనా దిగుమతి చేసుకునే వస్తువులు 19 శాతం మేర పడిపోయాయి. అదే సమయంలో అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులు సైతం 6.5 శాతానికి తగ్గాయి. అమెరికా విధిస్తున్న సుంకాలను భరించలేక చైనా తన దిగుమతులను తగ్గించింది. ఇక మరికొన్ని వస్తువులకు అనుమతులు ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తోంది.

Also Watch :

Next Story

RELATED STORIES