ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ

ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ECIL సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేపట్టింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు 2019 ఆగస్ట్ 26,27 తేదీల్లో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. ఇవి రెండేళ్ల కాంట్రాక్ట్ పోస్టులు. ప్రాజెక్ట్ అవసరాన్ని బట్టి కాంట్రాక్ట్ పొడిగించే అవకాశం ఉంటుంది. ఎంపికైనవారు న్యూఢిల్లీలో సెక్యూరిటీ సిస్టమ్స్ అండ్ ప్రాజెక్ట్ డివిజన్‌లో పని చేయాల్సి ఉంటుంది. సైంటిఫిక్ అసిస్టెంట్-ఏ పోస్టుకు ఆగస్ట్ 26న, ఆఫీస్ అసిస్టెంట్ ఆన్ కాంట్రాక్ట్ పోస్టుకు ఆగస్ట్ 27న ఇంటర్వ్యూ ఉంటుంది. మొత్తం పోస్టులు 28.. సైంటిఫిక్ అసిస్టెంట్ -ఏ కాంట్రాక్ట్ (Cat-1,ECE): 23 పోస్టులు .. సైంటిఫిక్ అసిస్టెంట్ -ఏ కాంట్రాక్ట్ (Cat-2,EEE): 03 పోస్టులు .. సైంటిఫిక్ అసిస్టెంట్ -ఏ కాంట్రాక్ట్ (Cat-3,R & A/Mechanical): 01 పోస్టు.. ఆఫీస్ అసిస్టెంట్ ఆన్ కాంట్రాక్ట్ : 01 పోస్టు.. విద్యార్హత: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమాలో 60% మార్కులతో ఫస్ట్ క్లాస్‌లో పాసై ఉండాలి. కనీసం ఏడాది అనుభవం తప్పనిసరి. ఆఫీస్ అసిస్టెంట్ ఆన్ కాంట్రాక్ట్ పోస్టుకు మూడేళ్ల బీఏ, బీకామ్, బీఎస్సీ డిగ్రీలో 60 శాతం మార్కులతో పాసై ఉండాలి. మూడేళ్ల అనుభవం ఉండాలి. వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించే అడ్రస్ ECIL Zonal Office, D-15, DDA Local Shopping Complex A-Block Ring Road, Naraina, New Delhi-110 028
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com