తెలంగాణలో నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు

తెలంగాణలో నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు
X

ప్రైవేట్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 40కిపైగా కార్పొరేట్ ఆస్పత్రుల్లో పేదలకు వైద్యం అందడం లేదు.. ఈ హాస్పిటల్స్‌లో నెలకు దాదాపు 700కుపైగా ఆపరేషన్లు జరుగుతుంటాయి. శస్త్రచికిత్స పూర్తయిన 40రోజుల్లో ప్రభుత్వం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ అలా జరగడం లేదు. దీంతో భారీగా బకాయిలు పేరుకుపోయాయి.. పైగా పాత రేట్ల ప్రకారమే ఇప్పటికీ ఆపరేషన్లు చేస్తుండటం వల్ల తమకు నష్టం వాటిల్లుతోందని ఆస్పత్రి యాజమాన్యాలు చెబుతున్నాయి...

తక్షణమే బకాయిలను క్లియర్ చేయాలని ప్రైవేట్ ఆస్పత్రులు డిమాండ్ చేస్తున్నాయి. అప్పటివరకు ఆరోగ్యశ్రీ నెట్‌వర్కింగ్ హాస్పటల్స్‌లో చికిత్సలు అందివ్వమని స్పష్టం చేస్తున్నాయి..అటు ఆస్పత్రులు ఆరోగ్య శ్రీకింద సేవలు నిలిపువేయడంతో పేదలు చాలా ఇబ్బంది పడుతున్నారు..ప్రభుత్వం వెంటనే స్పందించి చికిత్సలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు..

Tags

Next Story