అంతర్జాతీయం

ఎవరూ చూడట్లేదని హ్యాపీగా.. డెలివరీ బాయ్ నిర్వాకం.. వీడియో

ఎవరూ చూడట్లేదని హ్యాపీగా.. డెలివరీ బాయ్ నిర్వాకం.. వీడియో
X

పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ ఎవరూ చూడట్లేదనుకుంటుంది. అన్నీ తెలిసిన మనుషులు కూడా అలాగే చేస్తుంటారు ఒక్కోసారి. ఏ కెమెరా కన్నో గమనిస్తూనే ఉంటుంది. దాంతో అడ్డంగా బుక్కవుతారు. అనవసరంగా అవమానపాలవుతుంటారు. ఓ మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయినా చిలిపి మనసు చిత్రమైన పనులు చేయమంటూ పురిగొల్పింది. ప్లోరిడాలోని ఓర్లాండో శివారులోని మౌంట్‌దొరలో ఆగస్ట్ 11వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. అమెజాన్ డెలివరీ బాయ్ ఓ ఇంటికి వెళ్లి వాళ్లిచ్చిన ఆర్డర్‌ని డెలివరీ చేశాడు. అక్కడ చూడబోతే ఎవరూ కనిపించలేదు. ఓ పక్కన పెట్టి ఉన్న బుల్లి సైకిల్‌‌పై అతడి కన్ను పడింది. ఏ మాత్రం నదురు బెదురు లేకుండా వెంటనే చిన్న పిల్లలు నడిపే ఆ సైకిల్‌ని వేసుకుని ఎంచక్కా వెళ్లి పోయాడు.

తీరిగ్గా చూసుకున్న ఆ ఇంటి యజమానురాలు తన కూతురు బైక్ చోరీకి గురైందన్న విషయాన్ని గుర్తించింది. ఆ ఇంటికి అమర్చిన సీసీ కెమెరాలో చూసి డెలివరీ బాయ్ నిర్వాకమే అని తెలుసుకుంది. వెంటనే అతడిపై చర్యలు తీసుకోమంటూ ఆరెంజ్ కౌంటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీడియోలోని దృశ్యాల ఆధారంగా డెలివరీ బాయ్‌ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని విచారించగా.. ఆ బైక్ వాడట్లేదేమో.. బయటపడేశారేమో అనుకుని తీసుకెళ్లానని చెప్పాడు. చేసిన తప్పుని సమర్ధించుకోవాలని చూశాడు. అదంతా నీకనవసరం ముందు ఆ బైకుని తీసుకెళ్లి ఆవిడకు ఇచ్చేయని అమెజాన్ బాయ్‌ని పోలీసులు ఆదేశించారు.

Next Story

RELATED STORIES