మరో మహిళతో అక్రమసంబంధం పెట్టుకున్న భర్తను చితకబాదిన భార్య

మరో మహిళతో అక్రమసంబంధం పెట్టుకున్న భర్తను చితకబాదిన భార్య

భార్యా పిల్లలు ఉండగానే మరో మహిళతో అక్రమం సంబంధం పెట్టుకున్న భర్తకు దేహశుద్ది చేశారు స్థానికులు. అతడితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను కూడా చితకబాదారు. నడిరోడ్డుపై జుట్టుజుట్టు పట్టుకుని కొట్టుకున్నారు ఇద్దరు మహిళలు. హైదరాబాద్ నగరంలోని న్యూ హఫీజ్ పేట బస్తీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

యూసఫ్ గూడకు చెందిన లలిత, జైపాల్ కు పదేళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలం ఇద్దరూ అన్యోన్యంగానే కాపురం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కొంతకాలంగా భర్త సరిగా ఇంటికి రావడం లేదు. పిల్లలను కూడా పట్టించుకోవడం లేదు. దీంతో అనుమానం వచ్చిన భార్య ఆరా తీసింది. జైపాల్ మరోమహిళతో అక్రమం సంబంధం పెట్టుకున్నట్టు భార్య తెలుసుకుంది. దీంతో కాలనీకి చెందిన పెద్దమనుషులు, బంధువులతో కలిసి వెళ్లి భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. భర్తపై ఆగ్రహంతో చేయి చేసుకుంది. అడ్డొచ్చిన ఆ మహిళపైనా దాడి చేసింది.

Tags

Read MoreRead Less
Next Story