అంతర్జాతీయం

బాయ్‌ఫ్రెండ్‌ పక్కన సీటు అడిగితే ఇవ్వలేదని...

బాయ్‌ఫ్రెండ్‌ పక్కన సీటు అడిగితే ఇవ్వలేదని...
X

విమాన ప్రయాణం ఓ లగ్జరీ జర్నీ. బ్యాగ్ చెకింగ్ నుంచి మెుదలుకొని విమానంలో కూర్చునే వరకు ప్రతిదీ పద్ధతిగా జరుగుతాయి. మన గమ్యం చేరుకునే వరకు ఎయిర్ హోస్టెస్‌ చేసే సకల మర్యాదలూ వారి పలకరింపులు మనం ఎవరి దగ్గరా చూసి ఉండమేమో. ప్రయాణికులను వారు చంటి బిడ్డలా చూసుకుంటారు. ప్రతి ప్రయాణికుడిని నవ్వుతూ పలకరిస్తూ ఎలాంటి పరిస్థితుల్లోనైనా సహనాన్ని కోల్పోకుండా ఉంటారు. కానీ కొందరు వారి సహనాన్ని అలుసుగా తీసుకుంటారు. వారిపై దుర్భాషలు ఆడడం చేయి చేసుకోవడం చేస్తుంటారు. తాజాగా ఓ విమాన ప్రయాణికురాలు గగన సఖిని ఘోరంగా అవమానించింది.

ఓ ఎయిర్‌ఏషియా ప్లైట్‌లో ట్రావెల్ చేస్తున్న ఓ మహిళ తన బాయ్‌ఫ్రెండ్‌ పక్కన సీటు అడిగితే ఇవ్వలేదని ఎయిర్ హోస్టెస్‌‌పై అమానవీయంగా ప్రవర్తించింది. ఆమె ముఖంపై నూడిల్స్‌లోని వేడి నీరు విసిరికొట్టింది. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చైనాకు చెందిన ఓ యువతి, తన బాయ్‌ఫ్రెండ్‌తో ఎయిర్‌ఏషియా విమానంలో టికెట్ బుక్ చేసుకుంది. అయితే వారికి పక్కపక్క సీట్లు రాలేదు. దీంతో తన బాయ్‌ఫ్రెండ్‌ పక్కన సీట్లో కూర్చోబెట్టాలని నురాలియా మజ్లాన్‌ అనే ఎయిర్ హోస్టెస్‌ను కోరింది. సీట్ల మార్పునకు ఎవరూ ఒప్పుకోకపోవడంతో సర్దుబాటు చేయలేకపోతున్నానని ఎయిర్‌హోస్టెస్‌ ప్రయాణికురాలికి తెలిపింది. ఆ సమాధానంతో రగిలిపోయిన ఆ చైనీస్‌ యువతి తన చేతిలో ఉన్న నూడిల్స్‌ కప్పులోని వేడి నీటిని ఎయిర్‌హోస్టెస్‌ ముఖంపై విసిరిగొట్టింది. దీంతో ఇతర సిబ్బంది అక్కడికి చేరుకుని ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినిపించుకోలేదు. ఆమెకు బాయ్‌ఫ్రెండ్‌ కూడా తోడైయ్యాడు. విమానాన్ని పేల్చేస్తానంటూ సిబ్బందిపై బెదిరింపులకు పాల్పడ్డాడు.

చివరకు ఇతర ప్రయాణికులు కూడా కలగజేసుకుని వారికి సర్ధిచేప్పడంతో గొడవ ఆపారు. విమానం గమ్యస్థానానికి చేరగానే ఎయిర్‌పోర్టు భద్రతాసిబ్బందికి ఎయిర్ హోస్టె ఫిర్యాదు చేసింది. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్‌ఏషియా సంస్ధ కూడా వారిపై కఠిన నిర్ణయం తీసుకుంది. ఆ సంస్థ విమానాలలో ఎప్పుడూ ప్రయాణించకుండా ఆమెపై నిషేధం విధించింది.

Next Story

RELATED STORIES