పీకలదాకా తాగి వాటర్ ట్యాంక్‌పై నుంచి దూకిన వ్యక్తి

పీకలదాకా తాగి వాటర్ ట్యాంక్‌పై నుంచి దూకిన వ్యక్తి

అతను మద్యానికి తీవ్రంగా బానిసయ్యాడు. భార్యతో తరుచుగా గొడవలు పడేవాడు. చివరికి ఆ మద్యం మత్తులోనే ఓవర్‌హెడ్‌ వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అందరూ చూస్తుండగానే పైనుంచి దూకాడు. ఈ ఘటన సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలం కడవేరుగు గ్రామంలో జరిగింది.

వాటర్‌ ట్యాంక్‌పై నుంచి దూకిన వ్యక్తి పేరు యాదగిరి. తన కుటుంబంతో హైదరాబాద్‌లో నివసిస్తూ ఉంటాడు. వనభోజనాల కోసం సొంతూరికి వచ్చాడు. అప్పటికే పీకలదాకా తాగిన యాదగిరి ట్యాంక్‌ ఎక్కాడు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు రావడం చూడగానే ట్యాంక్‌పై నుంచి దూకాడు.

ట్యాంక్‌పై నుంచి దూకడంతో యాదగిరి కాళ్లు చేతులు విరిగాయి. స్పాట్‌లోనే ఉన్న పోలీసులు యాదగిరిని చేర్యాల ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌ తరలించారు. యాదగిరి శుక్రవారం రాత్రి కూడా కత్తితో మెడ కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story