ఏం తెలివిరా భయ్.. జొమాటో‌ని ఇలా కూడా వాడేస్తారా..

ఏం తెలివిరా భయ్.. జొమాటో‌ని ఇలా కూడా వాడేస్తారా..

ఆహా.. ఏం తెలివి.. పైసా ఖర్చులేకుండా ఎక్కడో ఉన్న రూంకి ఎంచక్కా వెళ్లిపోవచ్చు. అప్పటిదాకా ఇనార్బిట్ మాల్‌లో షాపింగ్ చేశాడు హైదరాబాద్‌కు చెదిన ఒబేష్ కొమిరిశెట్టి. బయటకొచ్చి చూస్తే టైమ్ చూస్తే రాత్రి 11.50 అయింది. క్యాబ్ బుక్ చేద్దామనుకుంటే అర్ధరాత్రి కావడంతో రేటు ఎక్కువ చూపిస్తుంది. అప్పుడే ఓ మెరుపులాంటి ఆలోచన అతడి బుర్రకు తట్టింది. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. ఆకలి దంచేస్తుంది. జొమాటో యాప్ ఓపెన్ చేసి తను ఉన్న ఇనార్బిట్ మాల్ ప్రాంతానికి సమీపంలోని దోసె బండి హోటల్ నుంచి ఎగ్ దోసె ఆర్డర్ చేశాడు. జొమాటో బాయ్ దోసె బండి దగ్గరకు వచ్చాడు ఆర్డర్ తీసుకోవడానికి. దాంతో ఒబేష్ వెళ్లి డెలివరీ బాయ్‌ని కలిశాడు. జొమాటోలో తానిచ్చిన అడ్రస్‌కి ఆర్డర్‌తో పాటు తననూ డ్రాప్ చేయమని అడిగాడు. అలాగే అని ఒబేష్‌ని రూమ్ దగ్గర దించాడు బాయ్. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఒబేష్.. నన్ను ఇంటికి చేర్చిన డెలివరీ బాయ్.. సర్ నాకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వండి అని మాత్రమే అడిగాడు. నన్ను ఫ్రీగా ఇంటి దగ్గర దించిన జొమాటోకు ధన్యవాదాలు అని పోస్ట్ చేశాడు. ఒబేష్ తెలివికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story