ఏపీలో పెట్టుబడుల కోసం ప్రతినిధుల్ని ఆహ్వానించిన సీఎం జగన్

X
అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి అక్కడి భారత రాయబారి హర్షవర్ధన్ ష్రింగ్లా తన నివాసంలో విందు ఇచ్చారు. అంతకుముందు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. అమెరికా విదేశాంగ శాఖ దక్షిణాసియా వ్యవహారాల ఉన్నతాధికారులతోనూ సమావేశం అయ్యారు. అట్లాంటిక్ కౌన్సిల్ దక్షిణాసియా సెంటర్‌కు చెందిన ఇర్ఫాన్ నూరుద్దీన్ కూడా సీఎంను కలిశారు. ప్రముఖ ఔషధాల తయారీ సంస్థ గిలీడ్ ప్రతినిధి క్లాడియో లిలియన్ ఫెలడ్ జగన్‌తో సమావేశమయ్యారు. ఏపీకి చెందిన ఔషధ కంపెనీలతో భాగస్వామ్యానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ గిలీడ్ ప్రతినిధిని కోరారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
