డిగ్రీ అర్హతతో ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో ఉద్యోగాలు.. అప్లైకి ఆఖరు తేదీ..

డిగ్రీ అర్హతతో ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో ఉద్యోగాలు.. అప్లైకి ఆఖరు తేదీ..

లైఫ్ ఇన్య్సూరెన్స్ కార్పొరేషన్‌కు చెందిన హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్, అసోసియేట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఇందులో మొత్తం 300 పోస్టులున్నాయి. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, అస్సాం, సిక్కిం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, చండీగఢ్, కర్నాటక, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, గోవా, గుజరాత్, మహారాష్ట్రలో ఖాళీలను భర్తీ చేయనుంది ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్.

విభాగాల వారీగా ఖాళీలు.. మొత్తం : 300 ఖాళీలు.. అసిస్టెంట్: 125 ఖాళీలు .. అసిస్టెంట్ మేనేజర్: 100 ఖాళీలు.. అసోసియేట్: 75 ఖాళీలు

విద్యార్హత: అసిస్టెంట్ పోస్టుకు 55% మార్కులతో గ్రాడ్యుయేషన్.. అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు 60% మార్కులతో గ్రాడ్యుయేషన్‌తో పాటు MBA, PGDM,PG Diploma చేసినవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.. అసోసియేట్ పోస్టుకు 60% మార్కులతో గ్రాడ్యుయేషన్‌తో పాటు CA ఇంటర్ ఉండాలి. వయసు: అభ్యర్థులు 21 నుంచి 28 సంవత్సరాలు మించకూడదు. దరఖాస్తు ఫీజు: రూ.500.. ముఖ్యమైన తేదీలు: దరఖాస్తు ప్రారంభం: ఆగస్ట్ 8, 2019, దరఖాస్తు చివరితేదీ: ఆగస్ట్ 26, 2019. కాల్ లెటర్స్ డౌన్‌లోడ్: సెప్టెంబర్ 9, 2019.

Tags

Read MoreRead Less
Next Story