ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూడ్ ఫోటో పోస్ట్ చేసిన మహిళా క్రికెటర్

ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూడ్ ఫోటో పోస్ట్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చారు ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ సారా. బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్ లో తిరుగులేని క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు సారా టేలర్. అద్భుతమైన వికెట్ కీపింగ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తారు. ఎంతగొప్ప పేసర్ బౌలింగ్ చేసినా ఆమె స్ట్రైట్ డ్రైవ్ అడితే బంతి బౌండరీ దాటాల్సిందే..! తను బ్యాటింగ్ చేసినంత సేపూ స్కోర్ బోర్డ్ పరుగులు పెడుతుందనడంలో ఆశ్చర్యం లేదు. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్లో మిథాలీ సేన విజయానికి గండికొట్టారు సారా.
న్యూడ్‌గా వికెట్ కీపింగ్ చేస్తున్న ఫోజులో ఓ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు సారా. ఆ పోస్ట్ ను చూసిన సారా అభిమానులు షాక్ అయ్యారు. న్యూడ్ ఫోటో షూట్ చేయటానికి గల కారణాన్ని వివరిస్తూ పోస్ట్ చేయడంతో.. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆ న్యూడ్ ఫోటోషూట్.. మహిళల శారీరక సమస్యలపై అవగాహన కల్పించేందుకే అని చెప్పారు. ఉమెన్స్ హెల్త్ యూకే చేసిన విజ్ఞప్తి మేరకే తాను అలా ఫోటోషూట్ చేశానని.. ఏదో సరదాకి చేసింది కాదని చెప్పుకొచ్చారు. ఇలా మహిళల ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించే క్యాంపెయిన్‌లో భాగస్వామిని అయినందుకు గర్విస్తున్నాను అని సారా ట్వీట్ చేశారు
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com