మార్కెట్లోకి 'యెజ్జీ' మోటార్ బైక్ వచ్చేస్తుందోచ్..

మార్కెట్లోకి యెజ్జీ మోటార్ బైక్ వచ్చేస్తుందోచ్..

మహీంద్రా అండ్ మహీంద్రా సొంతంగా ఏర్పాటు చేసిన బ్రాండ్ క్లాసిక్ లెజెండ్స్ ఆధ్వర్యంలో తిరిగి యెజ్జీ మోటార్ బైక్స్ ఇండియన్ మార్కెట్‌లోకి రానున్నాయి. ఈ విషయాన్ని క్లాసిక్ లెజెండ్స్ సహ వ్యవస్థాపకులు అనుపమ్ థారెజా తెలియజేశారు. బీఎస్‌ఎ బ్రాండ్ సంస్థ భారత విపణిలోకి విడుదల చేయనుంది. ఇన్‌స్టాగ్రామ్ న్యూ హ్యాండిల్‌లో యెజ్జీ మోటార్ సైకిల్ పేరు అధికారికంగా ప్రకటించారు. యెజ్జీ వెబ్‌సైట్ జావా మర్చండైజ్‌ను కస్టమర్లకు పరిచయం చేశారు. అయితే మార్కెట్లోకి ఎప్పుడు ప్రవేశపెడతారన్నది మాత్రం వెల్లడించలేదు. కానీ వచ్చే ఏడాది జరిగే ఆటో ఎక్స్‌పోలో నూతన వాహనాలను ప్రదర్శించనుంది. ఇంతకు ముందు రోడ్ కింగ్, ఆయిల్ కింగ్, క్లాసిక్, సీఎల్-2, మొనార్చ్, డీలక్స్, 350, 175 మోడల్ బైక్స్ ప్రజాదరణ పొందాయి. జావా మోటార్ బైక్ ఇంజన్ మాదిరే మహీంద్రా మోజో పవర్స్ యెజ్జీ బైక్ ఇంజన్ సామర్థ్యం కలిగి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story