భోజనంలో రాళ్లు వచ్చాయని అడిగినందుకు..

భోజనంలో రాళ్లు వచ్చాయని అడిగినందుకు..

జనగామలో బార్‌షాప్‌ యజమానులు రెచ్చిపోయారు. భోజనంలో రాళ్లు వచ్చాయని అడిగిన పాపానికి యువకులను చితకబాదారు. భువన్‌ బార్‌ యాజమానులు చేసిన దాడిలో చిటకోడూరు గ్రామానికి చెందిన మనోజ్, నితిన్‌, కనకరాజ్‌, శేఖర్ అనే యువకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. అటు బాధితులకు న్యాయం చేయకపోగా బార్‌ యాజమానులకు పోలీసులు వస్తాదు పలికారు. దీంతో బార్‌ ముందు చిటకోడూరు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. బార్‌ షాప్‌ యజమానులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story