బాలికపై రిటైర్డ్‌ టీచర్ అఘాయిత్యం

బాలికపై రిటైర్డ్‌ టీచర్ అఘాయిత్యం

సమాజంలో రోజు రోజుకి మానవ మృగాల ఆరాచకాలను అంతుపోంతు లేకుండా పోతుంది. వావి వరసలు, చిన్న పెడ్డా అనే తేడా లేకుండా విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు మృగాళ్లు. పదుల వయసు నిండిన పోరగాళ్ల నుంచి పండు ముసలోళ్ల వరకు అన్యం, పుణ్యం ఎరుగని అమాయకపు చిన్నారులపై తమ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా కేంద్రంలో పురాణిపేటలో కన్నుమిన్ను అనకుండా 15 ఏళ్ల మనువరాలిని చెడబట్టాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సభ్యసమాజాన్ని తలదించుకునే చేసింది.

గత ఏప్రిల్‌లో ఇంటికి వచ్చిన 10వ తరగతి చదువుతున్న వైష్ణవిని తన చిన్నతాత ఐన రిటైర్డ్‌ టీచర్‌ బ్రహ్మయ్య బంధాలు మరిచి పైచాశికంగా ప్రవర్తించాడు. రెండు సార్లు లైంగికదాడి చేశారు. వేసవి సెలవుల అనంతరం హాస్టల్‌కు వెళ్లిన బాలిక అనారోగ్య కారణాలతో ఈనెల 12న జిల్లా ప్రధాన ఆసుపత్రిలో చేరగా .. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు గర్భం దాల్చిందని అసలు విషయం చెప్పడంతో తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. పాపను అసలు విషయం అడగగా ఏడుస్తూ తనపై జరిగిన దారుణాన్ని తన కుటుంబ సభ్యులకు వివరించింది.

సదరు నిందితుని కుమారుడు ఎస్సైగా పనిచేస్తున్నాడని.. దీనికి తోడు గుండాలతో తమను చంపిస్తారని ప్రాణ భయంతో తాము ఎక్కడా ఫిర్యాదు చేయలని బాలిక తల్లి విలపిస్తోంది. అటు విషయం బయటకు పొక్కితే బాధితురాలి జీవితం అన్యాయం అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. న్యాయం కోసం రోడ్డెక్కలేని దయనీయ స్థితిలో ఉన్న ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయడం కోసం పోలీసులు ముందుకు రావాలని స్థానికులు కోరుతున్నారు. మదమెక్కిన ఆ మానవ మృగాన్ని చట్టపరంగా శిక్ష వెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.

Tags

Read MoreRead Less
Next Story