తండ్రిని ముక్కలుగా కోసి.. బకెట్‌లో వేసి..

తండ్రిని ముక్కలుగా కోసి.. బకెట్‌లో వేసి..

హైదరాబాద్‌లోని మల్కాజగిరిలో దారుణం జరిగింది. కన్నతండ్రిని కత్తితో పొడిచి హత్య చేశాడు ఓ కసాయి కొడుకు. ఆ తర్వాత ఆ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి బకెట్లో నింపాడు. ఈ హత్య జరిగి మూడ్రోజుల అయినట్లు తెలుస్తోంది. దుర్వాసన రావడంతో... స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలో దిగిన పోలీసులు... మూడ్రోజుల క్రితమే హత్య జరిగినట్లు నిర్ధారించారు.

80 ఏళ్ల మారుతి రిటైర్డ్‌ రైల్వే ఉద్యోగి. ఇతనికి ఉన్న ముగ్గురి సంతానంలో కిషన్‌ ఒకడు. ఇతను జులాయిగా తిరుగుతూ... చెడు అలవాట్లకు బానిసయ్యాడు. తండ్రి కొడుకుల మధ్య... ఏమి గొడవ జరిగిందో తెలియదంటున్నారు స్థానికులు. కానీ... తండ్రిని అతి కిరాతంగా చంపేశాడు. ఈ హత్య జరిగిన సమయంలో.. ఇంట్లోనే తల్లి, అతని చెల్లి ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని... క్లూస్‌ టీంతో దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story