బావను హత్య చేసిన బావమరిది

బావను హత్య చేసిన బావమరిది
X

పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం భోగాపురం సమీపంలోని ప్రకాష్‌నగర్‌లో రౌడీషీటర్‌ హత్య తీవ్ర కలకలంరేపింది. తూర్పుగోదావరి జిల్లా రామంచంద్రాపురానికి చెందిన వర్ధనపు హనీష్‌ను సొంత బావమరిది ఇనుపరాడ్‌తో తలపై మోది హత్య చేశాడు. హనీష్‌ తన మేనత్త గ్రామమైన ప్రకాష్‌నగర్‌కు శనివారం ఉదయం వెళ్లాడు. మేనత్త సుజాత కుమారితో ఘర్షణకు దిగి ఆమెపై దాడిచేసి బయటికి వెళ్లాడు. తల్లిపై దాడి చేయడంతో కోపోధ్రిక్తుడైన ప్రశాంత్‌.. హనీష్‌ రాగానే ఘర్షణకు దిగాడు. అక్కడ ఉన్న ఐరన్‌రాడ్‌తో తలపై తీవ్రంగా కొట్టాడు. దాడిలో హనీష్‌ అక్కడికక్కడే చనిపోయాడు. హత్యచేసిన ప్రశాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags

Next Story