చల్లగా ఇంటికి చేరుకున్న చిదంబరం.. గేటు దూకిన సీబీఐ అధికారులు..

X
కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను ఎనీటైమ్ అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన్ని అరెస్టు చేయడానికి సీబీఐ, ఈడీ అధికారులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. చిదంబరం ప్రెస్ మీట్ నేపథ్యంలో సీబీఐ, ఈడీ అధికారులు, AICC ఆఫీసుకు వచ్చారు. వారిని లోపలికి రాకుండా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ గొడవ జరుగుతుండగానే చిదంబరం వెళ్లిపోయారు. సీబీఐ, ఈడీ అధికారులు AICC ఆఫీసు వద్ద వేచి ఉండగా, చిదంబరం చల్లగా తన ఇంటికి చేరుకున్నారు. దాంతో దర్యాప్తు బృందాలు చిదంబరం ఇంటికి వచ్చాయి. అయితే.. ఎవరూ గేటు తీయకపోవడంతో.. అధికారులు గేటు దూకి లోపలకు వెళ్లారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
