ఆ సినిమాలో శ్రీదేవి గురించి.. కోర్టుకెక్కనున్న బోనీ

ఆ సినిమాలో శ్రీదేవి గురించి.. కోర్టుకెక్కనున్న బోనీ

'శ్రీదేవి బంగ్లా' సినిమాలో ఏముందో కాని సెన్సేషన్ అయితే క్రియేట్ అయింది. దానికి కారణం పోస్టర్ ఒకటైతే.. సినిమా పేరు మరొకటి. విడుదలకు ముందే తాను నటించిన చిత్రంలోని కన్నుగీటిన క్లిప్పింగ్ ద్వారా ఓవరనైట్‌లో స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ప్రియా ప్రకాష్ వారియర్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించింది. నిజ జీవితంలో శ్రీదేవి బాత్‌టబ్‌లో మరణించినట్టు చెబుతున్న సీన్‌కి కాపీ చేసినట్టు ఉంది ట్రైలర్. ఈ విషయంపై ఇప్పటికే శ్రీదేవి భర్త బోనీ కపూర్ చిత్ర యూనిట్‌కి లీగల్ నోటీసులు పంపించారు. అయితే బోనీ ఇచ్చిన నోటీసులను ఏమాత్రం పట్టించుకోలేదు చిత్ర యూనిట్. సినిమాలో సీన్స్ ఎలా ఉన్నా నాకనవసరం. కానీ టైటిల్‌లో శ్రీదేవి పేరు ఉండకూడదని బోనీ ఆంక్షలు పెడుతున్నారు. ఇంతటి వివాదానికి తెరలేపిన ఈ చిత్రంలో సల్మాన్ సోదరుడు అర్భజ్ ఖాన్ గెస్ట్ రోల్ చేస్తున్నాడు. సినిమాకు, శ్రీదేవికి ఎలాంటి సంబంధం లేదని తెలిసే నటించేందుకు ఒప్పుకున్నానని అర్భజ్ ఖాన్ అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story