యువతిపై అటవీశాఖ సిబ్బంది అత్యాచారయత్నం

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ప్రముఖ పర్యాటక కేంద్రం హార్స్‌లీహిల్స్‌కు వెళ్లిన ఓ యువతిపై ఏకంగా అటవీశాఖ సిబ్బందే అత్యాచార యత్నానికి పాల్పడడం కలకలం రేపుతోంది. అనంతపురం జిల్లా కదిరి చెందిన ఓ ప్రేమజంట హర్స్‌లీ హిల్స్‌కు చేరుకున్నారు. హిల్స్ సమీపంలోని గంగోత్రి సరోవరంలో కలిసి ఉన్న ప్రేమజంటను ఇద్దరు అటవీశాఖ ఉద్యోగులు.. రహస్యంగా వీడియోలు తీశారు. అనంతరం ఆ వీడియోలకు వారికి చూపించి బెదిరింపులకు దిగారు. వారి దగ్గర ఉన్న డబ్బు, బంగారాన్ని లాక్కున్నారు. అంతటితో ఆగని కామాంధులు యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న యువకుడు గట్టిగా కేకలు వేయడంతో ఇద్దరు నిందితులు పరారయ్యారు.
విషయం తెలుసుకున్న స్థానికులు, బాధిత ప్రేమజంట అటవీశాఖ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. తోటి అటవీ శాఖ ఉద్యోగులను ప్రశ్నిస్తున్నారు. అత్యాచారానికి యత్నించిన ఇద్దరు ఉద్యోగులు కాంట్రాక్ట్ గార్డులుగా హార్స్‌లీ హిల్స్‌లో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు గార్డులను సస్పెండ్ చేశారు ఫారెస్ట్ అధికారులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com