ఆంధ్రప్రదేశ్

ఏంటీ దారుణం.. సమాజం ఎటు పోతోంది? వీడియో వైరల్..

ఏంటీ దారుణం.. సమాజం ఎటు పోతోంది? వీడియో వైరల్..
X

రాకెట్ యుగంలో కుల వివక్ష కోరలు చాస్తూనే ఉంది. దాని వికృత రూపానికి ఎవరో ఒకరు బలవుతూనే ఉన్నారు. కుల వివక్ష ప్రజల్లో ఎంతలా నాటుకు పోయిందో తాజాగా తమిళనాడులో జరిగిన సంఘటనే ఉదాహరణ . అత్యంత ఘోరమైన, క్రూరమైన, దయారహితమైన ఈ ఘటన సమాజం తీరోగమనం వైపు ప్రయాణిస్తుందా అన్న సందేహం తలెత్తుంది. మనిషి బతికి ఉన్నప్పుడు ఎలా ఉన్నా చనిపోయిన తర్వాత వారికి కనీస గౌరవం ఇస్తాం. కానీ వెల్లూరులో కుప్పన్‌ అనే దళిత వ్యక్తి చనిపోతే అతని దహన సంస్కారాలు చేసే విషయంలో స్థానిక ఆధిపత్య కులానికి చెందిన కొందరు పెద్ద మనుషులు దారుణంగా ఫ్రవర్తించారు. అతని శవాన్ని తమ పొలాల మధ్యలో నుంచి తీసుకెళ్లడానికి వీల్లేదని పట్టుబట్టారు.

దీంతో వారి నిర్ణయానికి ఎదురుచెప్పని బంధువులు వేరే గత్యంతరం లేక మృతదేహాన్ని వంతెన పైనుంచి స్ట్రెచర్‌ ద్వారా కిందికి దించి అక్కడి నుంచి దహనం చేసే ప్రదేశానికి తీసుకెళ్ళాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటనను పలువురు త్రీవమైన చర్యగా ఆక్షేపిస్తున్నారు.

Next Story

RELATED STORIES