రాయలసీమలో కృష్ణమ్మ సందడి.. గండికోట జలాశయానికి కృష్ణా జలాలు

X
రాయలసీమలో కృష్ణమ్మ సందడి చేస్తోంది. కడప-అనంతపురం జిల్లాల వరప్రదాయని గండికోట జలాశయానికి కృష్ణా జలాలు వచ్చి చేరుతున్నాయి.. అవుకు హెడ్ రెగ్యులేటర్ నుంచి గండికోటకు నీటిని విడుదల చేశారు..ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 40 టీఎంసీలు. అయితే ముంపువాసులకు పరిహారం ఇంకా అసంపూర్తిగా ఉండిపోవడంతో కేవలం 12 టీఎంసీలు మాత్రమే నిల్వచేసేందుకు అస్కారం ఉంది. గండికోటలోకి దాదాపు 4 టీఎంసీల నీరు చేరిన తర్వాత.. మైలవరం, పైడిపాలెం జలాశయాలకు నీటిని విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
