అంతర్జాతీయం

నెల వయసున్న బాబుకు స్పీకర్‌ ఫీడింగ్‌

నెల వయసున్న బాబుకు స్పీకర్‌ ఫీడింగ్‌
X

మాములుగా ప్రజా ప్రతినిధుల సభలు ఎలా ఉంటాయి. సభ్యుల వాగ్వాదాలు.. ప్రతిపక్షాల ఆరోపణలు.. అధికార పక్షాల వివరణలతో సభలు గందరగోళంగా కనిపిస్తాయి. చట్ట సభలు ఇలాంటి వాటికే కాదు అక్కడ విలువలకు, ప్రేమకు కూడా చోటుందని న్యూజిలాండ్‌ పార్లమెంట్‌ నిరూపించింది. ఏడుస్తున్న ఓ ఎంపీ కూమారునికి పాలు పట్టి స్పీకర్‌ ట్రెవోర్‌ మల్లార్డ్‌ తన మంచి మనసును చాటుకున్నారు. ఈ ఆసక్తికర ఘటనకు న్యూజిలాండ్‌ పార్లమెంట్‌ వేదికైంది. తమాటీ కోఫీ అనే ఎంపీ నెల వయసున్న తన కుమారుడిని పార్లమెంటుకు తీసుకొచ్చారు. అయితే చర్చలో భాగంగా ఆమె ప్రసంగించాల్సిన సమయం వచ్చింది. ఈ సమయంలో చిన్నారి ఏడవడంతో అది గమనించిన స్పీకర్‌ ట్రెవోర్‌ మల్లార్డ్‌ పిల్లాడిని తన వద్దకు తీసుకురావాలని కోఫీని ఆదేశించారు. ఆ చిన్నారిని తన ఒడిలోకి తీసుకుని ఓదారుస్తు పాలు కూడా పట్టారు. అలా పాలు పడుతూనే సభను నిర్వహించారు.

దీనికి సంబంధించిన ఫోటోలను స్పీకర్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘ స్పీకర్‌ కుర్చీలో అర్హత కలిగిన అధికారి మాత్రమే కూర్చుంటారు. కానీ ఓ అనుకోని అతిధి నాతో పాటు ఆ వేదికపై చేరాడు. మీ కుటుంబంలోకి కొత్త వ్యక్తి చేరినందుకు తమాటీ కోఫీ , టిమ్‌లకు అభినందనలు’ అంటూ ట్వీట్ చేశారు. అవి సామాజిక మాధ్యమాలలో విపరీతంగా వైరల్‌ అయ్యాయి. దీంతో నెటిజన్ల కామెంట్స్‌తో స్పీకర్‌‌ను తెగ పొగిడేశారు.అత్యున్యత స్ధాయిలో ఉండి ఓ చిన్నారికి ఫీడింగ్ ఇచ్చి నెటిజన్ల మనసు దోచుకున్నారు స్పీకర్‌ ట్రెవోర్‌ మల్లార్డ్‌.

Next Story

RELATED STORIES