నీకు బాధ్యత ఉంటే ఇలా మాట్లాడవ్: పవన్‌పై 'చిరు' కోపంగా

నీకు బాధ్యత ఉంటే ఇలా మాట్లాడవ్: పవన్‌పై చిరు కోపంగా

మెగా బ్రదర్స్ ఇద్దరైనా పెద్దన్న చిరంజీవి అంటే ప్రత్యేక అభిమానం. అన్నలా ఆదరింపు.. నాన్నలా దండింపు.. ప్రేమతో పలకరింపులు.. అన్నీ రుచి చూశాడు తమ్ముడు పవన్ కళ్యాణ్. అన్న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అన్నాదమ్ముల అనుబంధాన్ని, చిన్ననాటి సంగతుల్ని గుర్తు చేసుకున్నారు పవన్. హైదరాబాద్‌లో అభిమానుల మధ్య జరిగిన చిరంజీవి పుట్టిన రోజు వేడుకలకు పవన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. నాకు ఇష్టమైన ఇద్దరు వ్యక్తులు సైరా సినిమాలో నటించారని.. అందులో ఒకరు అన్నయ్య చిరంజీవి అయితే.. మరొకరు అమితాబ్ బచ్చన్ అని అన్నారు. తాను కొన్ని సందర్భాల్లో నిరాశ నిస్పృహలకు గురైనప్పుడు అన్నయ్య ధైర్యాన్నిచ్చాడన్నారు.

యుక్త వయసులో ఉన్నప్పుడు దేశం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే కోపంతో ఊగిపోయేవాడినని అన్నారు. ఆ సమయంలో అన్నయ్య.. నువ్వు కులం, మతం దాటి మానవత్వం వైపు ఆలోచించాలని అన్నారు. 22 ఏళ్ల వయసులో ఆశ్రమంలో చేరిపోదామనుకుంటే.. అప్పుడు కూడా అన్నయ్య .. నువ్వు ఆధ్యాత్మికతవైపు వెళ్లిపోతే సమాజానికి ఉపయోగపడవు.. సమాజం పట్ల బాధ్యత ఉన్నవాడివైతే ఇలా మాట్లాడవు అని అన్నయ్య అన్న మాటలు నన్ను గుమ్మం దాటనివ్వకుండా చేశాయి. ఆ మాటలే నన్ను ఈ రోజు మీ ముందు నిలబెట్టాయి అని పవన్ ఉద్వేగపూరితంగా మాట్లాడారు. సైరా లాంటి గొప్ప చిత్రానికి తను వాయిస్ ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story