వాట్సప్‌లో నగ్నచిత్రాలను పంపించాలంటూ..

వాట్సప్‌లో నగ్నచిత్రాలను పంపించాలంటూ..

బెదిరించాడు,లొంగదీసుకున్నాడు. చివరకు జైలుపాలయ్యాడు. నిజామాబాద్‌ సనత్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ రయనుద్దీన్‌ శంకర్‌పల్లిలోని ఓ ప్రవేట్ విద్యాసంస్థలో బీబీఏ కోర్సు చదువుతున్నాడు. ఈ క్రమంలో సరూర్‌నగర్‌కు చెందిన ఓ విద్యార్థినితో స్నేహం చేయాలని ప్రయత్నించాడు. కానీ ఆ అమ్మాయి దానికి ఒప్పుకోలేదు. చివరకు చంపేస్తానని బెదిరించడంతో అంగీకరిచింది. ఈ పరిచయంలో ఆమెతో సన్నిహితంగా మెగిలాడు. ఏకాంతంగా ఉన్న సమయంలో సెల్ఫీలు తీసుకున్నాడు. చివరకు వికృత చర్యకు తెరలేపాడు. తాను చెప్పింది చేయలంటూ ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. లేకపోతే సెల్ఫీ చిత్రాలను తల్లిదండ్రులకు పంపిస్తానంటూ ఆమెను హెచ్చరించాడు. దీంతో భయపడిన బాధితురాలు అతను చెప్పినట్టు చేసింది. నగ్నచిత్రాలను వాట్సప్‌లో తనకు పంపించాలంటూ డిమాండ్‌ చేశాడు. చివరకు ఒత్తిడికి తలొగ్గి అలాగే చేసింది. ఆ చిత్రాలతో బాధితురాలును మరింతగా వేధింపులకు గురిచేశాడు. అతని చర్యలను తట్టుకోలేని విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు విచారించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story