ఆంధ్రప్రదేశ్

పది రోజుల్లోనే నిండిపోయిన శ్రీశైలం జలాశయం

పది రోజుల్లోనే నిండిపోయిన శ్రీశైలం జలాశయం
X

శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి తగ్గింది. ప్రస్తుతం జురాల నుంచి 14 వేల క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 30 వేల క్యూసెక్కుల వరద మాత్రమే వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం 884.50 అడుగుల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోని కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ దాదాపు 70వేల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు. గడిచిన 24 గంటల్లో రెండు విద్యుత్ కేంద్రాల ద్వారా 35 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు...

శ్రీశైలం ప్రాజెక్టు అన్ని క్రస్ట్‌గేట్లను మూసివేసిన అధికారులు.. గరిష్ఠ నీటిమట్టాన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో జులై 31న ప్రాజెక్టుకు వరద మొదలైంది. అది అంతకంతకూ పెరగడంతో కేవలం 10రోజుల్లోనే జలాశయం నిండిపోయింది. ఇన్‌ ఫ్లో ఎక్కువగా రావడంతో పదిరోజులపాటు నీటిని దిగువకు విడుదల చేశారు.

Next Story

RELATED STORIES