కేసీఆర్‌ నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదు - ఉత్తమ్‌

కేసీఆర్‌ నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదు - ఉత్తమ్‌

తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా దేవరకొండలో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఉత్తమ్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సీనియర్‌ నేత జానారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాలునాయక్‌తోపాటు పలువురు హస్తం నేతలు హాజరయ్యారు. తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ బలపడదని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. గత ఐదేళ్లలో తెలంగాణకు బీజేపీ చేసిందేమీలేదన్నారు. 2023లో టీఆర్‌ఎస్‌ను ఓడిస్తామని ఉత్తమ్‌ ప్రకటించారు. కేసీఆర్‌ అసమర్థత వల్లే గిరిజనులకు రిజర్వేషన్లు అమలు కావడంలేదని విమర్శించారు. కేసీఆర్‌ ఇప్పటివరకు ఏ ప్రాజెక్టులు పూర్తిచేశారో చెప్పాలని ఉత్తమ్‌ డిమాండ్ చేశారు. కాళేశ్వరం, మిషన్‌ భగీరథ, కాకతీయ కమీషన్ల కోసమేనని విమర్శించారు. మళ్లీ అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి ఇస్తానన్న కేసీఆర్‌.. ఎందుకు ఇవ్వడం లేదని ఉత్తమ్‌ ప్రశ్నించారు.

Tags

Next Story