తాజా వార్తలు

విశాల్ పెళ్లి ఆగిపోయిందా?

విశాల్ పెళ్లి ఆగిపోయిందా?
X

బహుభాషానటుడు, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ పెళ్లి ఆగిపోయినట్టు కోలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. విశాల్, అనీషా ల మధ్య మనస్పర్ధలు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు అనీషా.. తన సోషల్ మీడియా అకౌంట్‌ నుంచి విశాల్‌తో కలిసి దిగిన ఫోటోలను తొలగించింది. దీంతో ఈ వార్తలకు బలం చేకూరింది. అయితే విశాల్‌ మాత్రం అనీషాతో కలిసి దిగిన ఫోటోలను డిలీట్ చెయ్యలేదు. ఇక ఈ ప్రచారంపై విశాల్ గాని ఆయన కుటుంబసభ్యులు గాని ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇదిలావుంటే హైదరాబాద్‌కు చెందిన వాణిజ్యవేత్త కుమార్తె అనీషారెడ్డితో ఈ ఏడాది విశాల్ వివాహ నిశ్చితార్ధం జరిగిన సంగతి తెలిసిందే.

Next Story

RELATED STORIES